జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో సేవలపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ERRABELLI: 'రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు'
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని సూచించారు. జనగామ జిల్లా రామవరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రామవరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
కరోనా కష్టకాలంలోనూ రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసిన ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ కొనియాడారు. కొవిడ్ కల్లోలంలోనూ సంక్షేమ పథకాలు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు వంటి వాటిని ఆపలేదని మంత్రి గుర్తుచేశారు.