తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యవసరాలు వితరణ చేసిన మంత్రి ఎర్రబెల్లి - జనగామ జిల్లా పాలకుర్తి తాజా వార్తలు

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో పేదలు ఉపాధి కరవై ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల దాతలు, సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. ఈ తరుణంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న పేదలకు నిత్యవసరాలు వితరణ చేశారు.

Minister Errabelli distribute the essentials at palakurthi jangaon
నిత్యవసరాలు వితరణ చేసిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : May 13, 2020, 1:26 PM IST

లాక్​డౌన్​ సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనునిత్యం పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. పేదలకు పలు రకాలుగా సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.

మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బందికి, నిరుపేద కుటుంబాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి :హైజీనిక్​ కండిషన్​లోకి శంషాబాద్​ విమానాశ్రయం

ABOUT THE AUTHOR

...view details