రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. జనగామ జిల్లా దేవరుప్పులలో తెరాస కార్యకర్తలు నిర్వహించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.
'రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కృషి' - farmers happy
లాక్డౌన్ సమయంలోనూ రైతు బంధు అమలుతో పాటు, రూ.25వేల రుణ మాఫీ చేసినందుకు గానూ.. జనగామ జిల్లా దేవరుప్పులలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు.
'రైతులు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు సీఎం కృషి'
రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉండేందుకు సీఎం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. రైతు బంధు కోసం రూ. 7వేల కోట్లు, రుణమాఫీ కోసం రూ.12 వందల కోట్లు, ఉపాధి హామీ కూలీలకు రూ.170 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ. 370 కోట్లు విడుదల చేశారని వివరించారు.