తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించం: ఎర్రబెల్లి - కొడకండ్ల సహకార ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎర్రబెల్లి

సహకార ఎన్నికల్లో తెరాస మద్దతుదారుల విజయానికి కృషిచేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. జనగామ జిల్లా కొడకండ్ల సహకార ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.

errabelli dayakarrao
పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించం: ఎర్రబెల్లి

By

Published : Feb 12, 2020, 6:41 PM IST

జనగామ జిల్లా కొడకండ్ల సహకార ఎన్నికల సన్నాహక సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తెరాస మద్దతు తెలిపిన అభ్యర్థులందరిని సమష్టిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

గత పాలకవర్గం హయంలో డీసీసీబీ, సహకార రంగంలో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. దాదాపు రూ.80 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పారదర్శకమైన పాలకవర్గాలను ఎన్నుకొని రైతుల సంక్షేమం కోసం కృషి చేద్దామని తెలిపారు. సీఎం కేసీఆర్ గ్రామాల సమగ్ర అభివృద్ధికి పట్టుదలతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించం: ఎర్రబెల్లి

ఇవీచూడండి:'5 నిమిషాలు రైతుల గురించే చర్చించే సమయం దొరకలేదా..?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details