కొవిడ్ బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల వైరస్ తీవ్రత తగ్గుతోందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.
కొవిడ్ బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలి: ఎర్రబెల్లి - తెలంగాణ తాజా వార్తలు
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
errabelli
కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని.. వైరస్ను తరిమికొట్టాలని పేర్కొన్నారు. కొవిడ్ బాధితుల్లో ప్రజాప్రతినిధులు మనోధైర్యాన్ని నింపాలని తెలిపారు.
ఇదీ చూడండి:Yadadri: యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎంఓ