తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవరుప్పులలో చెరువులను సందర్శించిన ఎర్రబెల్లి - minister errabelli dayakar rao visit fonds

దేవరుప్పుల మండలంలో పలు చెరువులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సందర్శించారు. ఖరీఫ్​ పూర్తయ్యే సమయానికి మరోసారి చెరువులను నింపేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

దేవరుప్పులలో చెరువులను సందర్శించిన ఎర్రబెల్లి

By

Published : Nov 21, 2019, 10:33 PM IST

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పర్యటించారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న దేవరుప్పుల మండలంలోని చెరువులను మత్తడి పోయిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి అన్నారు. దేవరుప్పులలోని గుడి చెరువుకు ద్విచక్రవాహనంపై చేరుకున్న మంత్రి... కేసీఆర్​ చిత్రపటానికి అభిషేకం చేశారు. ముఖ్యమంత్రి సహకారంతోనే చెరువులను నింపడం సాధ్యమైందన్నారు. ఖరీఫ్​ పంటలు చేతికొచ్చే సమయానికి మరో దఫా చెరువులు నింపేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో తాగు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దేవరుప్పుల చౌరస్తాలో లోపించిన పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ప్రణాళిక స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉన్న దుకాణాల యజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం సింగరాజుపల్లిలోని సింగరాయ చెరువును మంత్రి సందర్శించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను ప్రారంభించారు.

దేవరుప్పులలో చెరువులను సందర్శించిన ఎర్రబెల్లి

ఇదీ చూడండి: కాళ్లు, వెన్నుముక లేకున్నా... బండి నడుపుతూ...

ABOUT THE AUTHOR

...view details