తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. ఈ నెల 31న సీఎం పర్యటించనున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు... కలెక్టర్, డీసీపీ, ఏసీపీ, జిల్లా అధికారులకు అప్పగించారు.

minister errabelli dayakar rao visit cm kcr tour arrangments in kodakandla
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Oct 29, 2020, 6:15 PM IST

ఈ నెల 31న జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, డబుల్​ బెడ్​రూ ఇళ్లు, సభాస్థలి, హెలిప్యాడ్​ నిర్మాణ పనులు పర్యవేక్షించారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల బాధ్యతలను కలెక్టర్ కె.నిఖిల, డీసీపీ, జిల్లా అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

ABOUT THE AUTHOR

...view details