తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం కావడానికి మెుదట బలిదానం చేసిన శ్రీకాంతాచారిని కాపాడడానికి శాయశక్తులా కృషి చేశానని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఉద్యమంలో ఎక్కడ ఉన్నావని కొందరు తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాంతాచారి స్వగ్రామం గొల్లపల్లిలో ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
శ్రీకాంతాచారిని కాపాడడానికి శాయశక్తులా కృషి చేశా: ఎర్రబెల్లి - telangana varthalu
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారిని కాపాడడానికి శాయశక్తులా కృషి చేశానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శ్రీకాంతాచారి స్వగ్రామం గొల్లపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించటంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Breaking News
రెండు పడక గదుల ఇళ్లు, రైతువేదిక భవనం, గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తోందని ఎర్రబెల్లి విమర్శించారు.
ఇదీ చదవండి: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌కు వాలంటీర్ల ఉత్సాహం