జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో యాసంగి పంటల కొనుగోలు, సమీకృత మార్కెట్ నిర్మాణం, పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై జిల్లా అధికారులతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్షించారు.
యాసంగి పంటల కొనుగోళ్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష - errabelli dayakar rao review on rabi crop sales
యాసంగి పంటల కొనుగోలు, సమీకృత మార్కెట్ నిర్మాణంపై జనగామ జిల్లా అధికారులతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపైనా సమీక్షించారు.
ఎర్రబెల్లి సమీక్ష, ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, భౌతిక దూరం తప్పని సరి అని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పాలనాధికారి నిఖిల, జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :కెనడాలో నల్గొండ జిల్లా విద్యార్థి ఆత్మహత్య