జనగామ కలెక్టరేట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడకుండా కాపాడుకునేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మన దేశం, రాష్ట్రంలోకి కరోనా వచ్చిందని చెప్పారు.
ప్రజలంతా సహకరించాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ కరోనా నుంచి బయటపడాలంటే.. ప్రజలందరూ సహకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ప్రజలంతా సహకరించాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు
సర్పంచ్ నుంచి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులంతా తమ గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్1 నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'
TAGGED:
janagama latest news