తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు - Minister Errabelli Dayakar Rao at the Karunapuram Christmas celebrations

జనగామ జిల్లా చిల్పూర్ మండలం కరుణాపురం చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Errabelli Dayakar Rao participated Christmas celebrations
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

By

Published : Dec 25, 2020, 10:40 PM IST

జనగామ జిల్లా చిల్పూర్ మండలం కరుణాపురం చర్చి క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. కేకు కోసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏసుక్రీస్తు జయంతి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కుటుంబ సమేతంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ రావడంతో మందిరాలన్నీ కోలాహలంగా మారాయి. క్రైస్తవులకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్​భాస్కర్

ABOUT THE AUTHOR

...view details