తెలంగాణ

telangana

ETV Bharat / state

'తండాలను పంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్​దే' - తెలంగాణ వార్తలు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. తండాల్లో గిరిజనుల సంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే సేవాలాల్ జయంతికి గుర్తింపు లభించిందని మంత్రి అన్నారు.

minister-errabelli-dayakar-rao-participated-in-sevalal-birth-anniversary-celebrations-at-palakurthy-in-jangaon
తండాలను పంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్​దే: ఎర్రబెల్లి

By

Published : Mar 1, 2021, 8:42 PM IST

తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్​దే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తండాల్లో గిరిజనుల సంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

తండాలను పంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్​దే: ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ పాలనలోనే సేవాలాల్ జయంతికి గుర్తింపు లభించిందని మంత్రి పునరుద్ఘాటించారు. గిరిజనులకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు. తండాల్లో గుడుంబాని రూపుమాపినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కస్తూర్బా పాఠశాలలో కొవిడ్​ కలకలం.. ఏడుగురికి పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details