తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదికలు కర్షక దేవాలయాలు: మంత్రి నిరంజన్ రెడ్డి - కొడకండ్ల రైతు వేదిక ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

రైతు వేదికలు కర్షక దేవాలయాలు అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ వేదికల ద్వారా ఆలోచనలు పంచుకొని అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​లతో కలిసి ఆయన పరిశీలించారు.

minister errabelli dayakar rao niranjan reddy review on raithu vedika at kodakandla in janagon district
రైతు వేదికలు కర్షక దేవాలయాలు: మంత్రి నిరంజన్ రెడ్డి

By

Published : Oct 30, 2020, 1:46 PM IST

రైతు వేదికలు కర్షక దేవాలయాలని... దేశంలో నూతన ఒరవడికి నాంది అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఈ వేదికల ద్వారా కొత్త ఆలోచనలు, నూతన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుని అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నందున ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్‌, కడియం శ్రీహరిలతో కలిసి ఆయన పరిశీలించారు. ఇవి కేవలం రైతు వేదికే కాదు తెలంగాణ రైతుల భవిష్యత్ వేదికలని కొనియాడారు.

శనివారం ప్రారంభం

రైతు రాజుగా బతకాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. 2006 క్లస్టర్లు రైతు వేదికలుగా నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైతు వేదికను భవిష్యత్‌లో ఆధునీకరించే విధంగా సీఎం నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. కొడకండ్లలో రైతు వేదికను సీఎం శనివారం ప్రారంభించనున్నారని తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇదీ చదవండి:కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details