తెలంగాణ

telangana

ETV Bharat / state

'నష్టపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దు' - నీటమునిగిన పంటలు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

అకాల వర్షానికి కకావికలమైన జనగామ రైతుల పంటపొలాలను పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. నష్టపోయిన కర్షకులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.

minister errabelli dayaka rao visited fields in janagaon district
'నష్టపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దు'

By

Published : Mar 20, 2020, 5:51 PM IST

'నష్టపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దు'

రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు జనగామ జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి, జఫర్​గడ్​ మండలాల్లో పర్యటించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన పంటల పొలాలను పరిశీలించారు.

పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్నదాతలెవరూ అధైర్యపడవద్దని, నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details