తెలంగాణ

telangana

ETV Bharat / state

'డబుల్ ఇళ్లు సకాలంలో పూర్తి చేయకుంటే బ్లాక్​ లిస్టులో పెడతాం' - డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్ళ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజా వ్యాఖ్యలు

జనగామ జిల్లా పాలకుర్తిలో డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ళ నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కాంట్రాక్టర్​లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ప్రారంభం కాని నిర్మాణాలు మరో 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Minister Errabelli Botheration upon contractors of double bedroom houses delaying in Palakurthy of janagama district
డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ళ కాంట్రాక్టర్​లపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు

By

Published : Jul 7, 2020, 7:03 PM IST

డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్ళ నిర్మాణాల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్​లపై పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు వేదిక, మహిళా స్త్రీ శక్తి భవన నిర్మాణాలకు ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పేదల సొంతింటి కలైన డబుల్​ బెడ్​రూమ్ ఇళ్ళ నిర్మాణాలు... పాలకుర్తిలో నత్త నడకన సాగుతున్నాయని కాంట్రాక్టర్​లపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ను ఒప్పించి పాలకుర్తికి 5,000​ ఇళ్ళు మంజూరు చేయించానని చెప్పారు. పూర్తైన​ ఇళ్ళ ప్రారంభోత్సవం ఈ నెల 25లోపు జరగాలన్నారు. వారంరోజుల్లో గృహ నిర్మాణాలు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్​లిస్ట్​లో పెడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ నిఖిలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు.

డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ళ కాంట్రాక్టర్​లపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు

ఇదీ చూడండి :'కేసీఆర్​కు కూల్చడం తప్ప.. బతుకులు నిలబెట్టడం తెలియదు'

ABOUT THE AUTHOR

...view details