రైతు సంక్షేమం దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి దన్నుగా ఉండేందుకు సహకార ఎన్నికల్లో సమర్థులనే ఎన్నుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలోని వాసవీ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సహకార ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
'సహకార ఎన్నికల్లో విజయాన్ని కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం' - latest news on minister errabelli
వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. సహకార ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
!['సహకార ఎన్నికల్లో విజయాన్ని కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం' minister errabelli attend Activists meeting in jangaon district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6054394-1100-6054394-1581560998196.jpg)
'సహకార ఎన్నికలను గెలిచి.. కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి'
మండలంలోని 13 వార్డులను సునాయాసంగా గెలిచి కేసీఆర్‌కు కానుకగా అందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనం కోసం తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. తెరాస బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఎన్నికల వల్ల ఇన్ని రోజులు అభివృద్ధి కుంటుపడిందని.. వచ్చే 6 నెలల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
'సహకార ఎన్నికలను గెలిచి.. కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి'
ఇవీ చూడండి: కోటి విలువగల బంగారం పట్టివేత... ఆరుగురి అరెస్ట్