తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరవు సీమను గోదావరి జలాలతో తడిపాం'

రైతుల బాగుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కరవు ప్రాంతమైన జనగామను గోదావరి జలాలతో తడిపిన మహనీయుడని కొనియాడారు.

By

Published : May 12, 2020, 3:12 PM IST

Minister Erbabeli Dayakar Rao opened the mango buying centre in Janagama
కరవు సీమను గోదావరి జలాలతో తడిపాం

జనగామ జిల్లా పెద్దపహాడ్​లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మామిడి కాయల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాల కాలంలో కరెంట్​, ఎరువుల కోసం రోడ్లపై రైతులు ధర్నాలు చేసేవారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు గోదాముల నిర్మాణము చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మామిడి చెట్టు నుంచి కాయలను కోశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్​ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details