ప్రతి ఒక్కరూ మంచిమార్గంలో పయనించి సమాజ శ్రేయస్సుకు కృషిచేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకలను ఆయన ప్రారంభించారు.
దైవ మార్గమే శాంతి, సమానత్వానికి చిహ్నం: కడియం
క్రైస్తవం అంటే మతం కాదని ఒక మంచి మార్గమని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
దైవ మార్గమే శాంతి, సమానత్వానికి చిహ్నం : కడియం
దేవుని ఆశీర్వాదంతో ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు జన్మించిన, శిలువ వేసిన ప్రదేశాలను సందర్శించి తాను ముక్తి మార్గంలో ప్రయాణించినట్లు తెలిపారు. చర్చి నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలను త్వరలో అందించనున్నట్లు వెల్లడించారు. సమాజంలో శాంతి, సమానత్వం పొందాలంటే ప్రతి ఒక్కరు యేసయ్య మార్గంలో నడవాలన్నారు.