జనగామ జిల్లాలో మరో ఇద్దరు వలస కూలీలకు కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ నెల 11న రఘునాధపల్లి మండలానికి చెందిన భార్యభర్తలు ముంబయి నుంచి స్వగ్రామానికి వచ్చారు. అదే రోజు వీరిద్దరినీ కరోనా పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. బుధవారం పరీక్ష రిపోర్టులు రాగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు డిప్యూటీ డీఎంహెచ్వో తెలిపారు.
వలస కూలీ దంపతులకు కరోనా పాజిటివ్!
ముంబయి నుంచి జనగామ జిల్లాలో స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారి వచ్చిన బస్సులో 25 మంది ప్రయాణించగా.. వారందరినీ హోం క్వారంటైన్లో ఉంచారు.
వలస కూలీ దంపతులకు కరోనా పాజిటివ్!
భార్యాభర్తలిద్దరికీ పాజిటివ్ రాగా ముంబయి నుంచి వారి బస్సులో 25 మంది ప్రయాణించినట్లు తెలియగా.. వారందరినీ హోం క్వారంటైన్లో ఉంచారు. కోడూరుకు చెందిన మరొకరు స్వీయనిర్బంధంలో ఉండగా.. వైద్య పరీక్షలు నిర్వహించకుండా అతన్ని హోం క్వారంటైన్లో ఉంచినందుకు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'