గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22న జయంతి సందర్భంగా జనగామ జిల్లా వడ్లకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రామానుజన్ జీవిత చరిత్రతో పాటు, గణిత సూత్రాలు, సులభ పద్ధతులను చార్టుల రూపంలో ప్రదర్శించి తోటి విద్యార్థులకు వివరించారు.
'నిత్యజీవితంలో గణితం ఎంతో అవసరం'
మన నిత్యజీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పనిలో గణితశాస్త్ర ప్రముఖ్యత విడదీయరాని అనుబంధంలాంటిది. ఆదివారం గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లాలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
'నిత్యజీవితంలో గణితం ఎంతో అవసరం'
విద్యార్థులు ప్రదర్శించిన కొలతలు, కొలమానాలు సులభంగా గుర్తించే ప్రదర్శన ఆకట్టుకుంది. నిత్యజీవితంలో గణితం ప్రాముఖ్యత చాలా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పనిలో గణితశాస్త్ర లెక్కలు ఉపయోగపడతాయని వెల్లడించారు. కనీసం చాతుర్వేద ప్రక్రియలైన కుడిక, తీసివేత, గుణకారం, భాగాహారాలైన నేర్చుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్