జనగామ జిల్లాలో కొవిడ్-19పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించే విధంగా స్టేషన్ ఘన్పూర్లో మహాత్ముడి విగ్రహానికి మాస్క్ కట్టారు.
అక్కడ గాంధీ విగ్రహానికి మాస్క్ కట్టారు - జనగామ
రోజు రోజుకి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. అయినప్పటికి పలు చోట్ల ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించడం లేదు. నిత్యం రోడ్లపైకి రావడం.. విచ్చలవిడిగా తిరగడం చేస్తున్నారు. ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధుల కేసం బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున భౌతిక దూరం పాటించకుండా చేరారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కోసం స్టేషన్ ఘన్పూర్లో గాంధీ విగ్రహానికి మాస్కు కట్టి కరోనాపై ప్రచారం చేస్తున్నారు.
అక్కడ గాంధీ విగ్రహానికి మాస్క్ కట్టారు
కొంత మంది యువకులు మహాత్ముని విగ్రహం మూఖానికి మాస్కు కట్టి కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని అర్థమయ్యే విధంగా ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చూడండి :200 కుటుంబాలకు తెరాస యువనాయకుల సాయం