జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామ శివారులో ఉన్న మల్లన్న గండి జలాశయాన్ని నీటిపారుదల సీఈవో బంగారయ్య, ఇతర అధికారులు సందర్శించారు. జలాశయం దిగువన ఉన్న ఏడు గ్రామాల ప్రజలు తమకు తాగునీరు అందించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని ఆశ్రయించగా.. ఆయన గ్రామ ప్రజల గోడును వినతి పత్రం ద్వారా సీఎంకు చేరవేశారు.
మల్లన్నగండి జలాశయంతో ఏడు గ్రామాల దాహార్తి తీరుతుంది! - mallanna gandi reservoir latest news
జనగామ జిల్లాలోని మల్లన్నగండి జలాశయ కుడి కాలువను నీటిపారుదల శాఖ సీఈవో బంగారయ్య సందర్శించారు. జలాశయ దిగువన ఉన్న గ్రామ ప్రజలకు నీరు అందించేందుకు ప్రాథమిక సర్వే నిర్వహించారు.
మల్లన్నగండి జలాశయాన్ని సందర్శించిన నీటిపారుదల శాఖ సీఈవో
సీఎం ఆదేశాల మేరుకు ఆదివారం నీటిపారుదల శాఖ సీఈఓ బంగారయ్య కుడి కాలువ ఏర్పాటు కోసం స్థానిక నీటిపారుదల, దేవాదుల అధికారులతో కలిసి ప్రాథమిక సర్వే నిర్వహించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!