జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఊరిలోని బొడ్రాయి, గ్రామదేవతల ఐదోవార్షికవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన బంధువుల రాకతో గ్రామంలోని వీధులన్నీ కళకళలాడాయి.
మల్కాపూర్‌లో ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు - జనగామ జిల్లా తాజా వార్త
జనగామ జిల్లా మల్కాపూర్‌లో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు.. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
![మల్కాపూర్‌లో ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు malkapur village goddess festival celebrations in janagam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7515250-258-7515250-1591525815246.jpg)
మల్కాపూర్‌లో ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు
మహిళలు, పిల్లలు బోనం ఎత్తుకొని బొడ్రాయి వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.