జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచకు చెందిన యువతి, అదే ప్రాంతానికి చెందిన గునుగంటి మహేశ్లు 9 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమని యువతి కోరగా నీది వేరే కులం, మా అమ్మ ఒప్పుకోవడం లేదంటూ యువకుడు చెప్పగా... తనకు న్యాయం చేయాలంటూ మహేశ్ ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది.
'నీది వేరే కులం... నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'
ప్రేమించాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదేళ్లు ప్రేమ బంధంలో శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి చేసుకోమంటే నీది వేరే కులం అంటూ మొహం చాటేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆ యువతి ప్రేమికుడి ఇంటి ముందు ప్రేమ కోసం నిరీక్షిస్తున్న ఘటన జనగామలో చోటు చేసుకుంది.
'నీది వేరే కులం... నిన్నేలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'
9 సంవత్సరలు ప్రేమించి... అన్ని అవసరాలు తీర్చుకున్నాడని యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి:'నాకు పెళ్లి కావాలి.. వధువును వెతికి పెట్టండయ్యా..!'