జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని వెల్డండలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల 77 మందిని క్వారంటైన్‌కు తరలించారు. గ్రామంలో ఎవరూ బయటకు వెళ్లకపోవడం వల్ల వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్పందించిన పలువురు నిత్యావసరాలను అందిస్తున్నారు. కొంత మంది చెక్కులు ఇస్తున్నారు.
వెల్డండకు విరాళాల వెల్లువ
ఆ ఊరిలో ఒకరికి కరోనా సోకింది. అతన్ని కలిసిన 77 మందిని క్వారంటైన్‌కు తరలించారు. గ్రామాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. గ్రామస్థులకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.
వెల్డండకు విరాళల వెల్లువ
మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రూ.50 వేలు అందించారు. పీఏసీఎస్ మాజీ వైస్ ఛైర్మన్ పెద్ది రాజిరెడ్డి రూ.51 వేలు, మాజీ ఛైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి రూ. 21 వేలు, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ రూ.10 వేలు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు రూ.58 వేలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తున్నారు.
ఇదీ చూడండి :'ఎంపీ ల్యాడ్స్ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'