సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పాల్గొని కేసులను పరిష్కరించారు. కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా రాజీ మార్గమే రాజ మార్గమని పరస్పర అంగీకారంతో ముందుకు వచ్చి కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమానికి కక్షిదారులు భారీ ఎత్తున తరలివచ్చి కేసుల్లో రాజీ పడ్డారు. భూ, సివిల్ తగాదాలు, బ్యాంకు బకాయిలు, ఎక్సైజ్ కేసులు పరిష్కరించి.. నిందితులకు జరిమానాలు విధించారు.
రాజీ మార్గమే రాజ మార్గం - లోక్ అదాలత్ కార్యక్రమం
జహీరాబాద్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ మార్గమే రాజ మార్గమని జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ఈ కార్యక్రమానికి కక్షిదారులు భారీ ఎత్తున వచ్చి కేసుల్లో రాజీ పడ్డారు.
![రాజీ మార్గమే రాజ మార్గం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4439435-thumbnail-3x2-judge.jpg)
రాజీ మార్గమే రాజ మార్గం