చేనేత కార్మికులకు మద్దతిచ్చిన కోదండరాం - చేనేత కార్మికులకు మద్దతిచ్చిన కోదండంరాం
చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని... వారి డిమాండ్లను నెరవేర్చాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వానికి సూచించారు.
![చేనేత కార్మికులకు మద్దతిచ్చిన కోదండరాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4385786-622-4385786-1568031045811.jpg)
చేనేత కార్మికులకు మద్దతిచ్చిన కోదండంరాం
జనగామ జిల్లాలో చేనేత పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేనేత కార్మికులు నిరాహారదీక్ష చేపట్టారు. నిరసనకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం అని, చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోదండంరాం సూచించారు. చేనేత కార్మికులకు సబ్సిడీ నూలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.
చేనేత కార్మికులకు మద్దతిచ్చిన కోదండరాం