తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు : బండి సంజయ్

కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని... కావాలనే లీకులు ఇస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమన్నారు. రాష్ట్రంలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Jan 5, 2021, 11:32 AM IST

Updated : Jan 5, 2021, 1:25 PM IST

రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని... కావాలనే లీకులు ఇస్తున్నారన్నారు. మరో మూడేళ్లు సీఎంగా కేసీఆర్​ కొనసాగుతారని చెప్పారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్​కు జనగామ జిల్లా పెంబర్తి వద్ద భాజపా శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. అనంతరం జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో అల్పాహారం పూర్తి చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

తెరాస కుటుంబ, అవినీతి పాలనే భాజపా విజయానికి కారణం. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసి గెలవాలన్నదే కేసీఆర్ ఆలోచన. డబ్బు పంపిణీ చేసినా దుబ్బాక, గ్రేటర్‌లో తెరాసకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆలోచన విధానం మార్చుకోవాలి.

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. త్వరలోనే నియోజకవర్గ వారిగా ఎమ్మెల్యేల అవినీతి చిట్టను బయటపెడతామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం అని తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విన్నవించినా... కలిసి రావడం లేదని చెప్పారు. త్వరలోనే అవినీతి పాలనకు చరమగీతం పాడి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడతామని తెలిపారు.

కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు : బండి సంజయ్

ఇదీ చదవండి :ఏపీలో పొలిటికల్ హీట్... సోము వీర్రాజును అడ్డుకున్న పోలీసులు, తోపులాట

Last Updated : Jan 5, 2021, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details