తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్య సాధకులు... సత్తా చాటారు - జనగామ జిల్లా తాజా వార్తలు

సివిల్స్ ఫలితాల్లో జనగామ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. నర్మెట్ట మండలం బొమ్మకూరుకు చెందిన బానోతు రాకేశ్‌నాయక్‌ అఖిల భారత స్థాయిలో 694 ర్యాంకు సాధించగా.. పాలకుర్తి మండలం వాల్మీడికి చెందిన ప్రేమసాగర్ 170 ర్యాంక్ సాధించారు.

లక్ష్య సాధకులు... సత్తా చాటారు
లక్ష్య సాధకులు... సత్తా చాటారు

By

Published : Aug 5, 2020, 8:35 AM IST

జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరుకు చెందిన గిరిజన బిడ్డ బానోతు రాకేశ్​నాయక్​ అఖిల భారత స్థాయిలో 694 ర్యాంకు సాధించారు. ఇతని తల్లిదండ్రులు బానోతు శంకర్‌నాయక్‌, బానోతు సత్తెమ్మ. తండ్రి గ్రామ సర్పంచి. తల్లి గృహిణి. ఈయన పదో తరగతి వరకు మల్కాజ్‌గిరిలోని సెయింట్‌ఆన్స్‌ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ హబ్సిగూడలోని నారాయణ కళాశాలలో, ఇంజినీరింగ్‌ ఐఐటీ కాన్పూర్‌లో 2015లో పూర్తి చేశారు. 2016 నుంచి దిల్లీ కరోల్‌బాగ్‌లోని వాజీరామ్‌ అండ్‌ రవి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందారు.

నాలుగో ప్రయత్నంలో భాగంగా 2019 సివిల్స్‌ ఫలితాల్లో రెండోసారి ముఖాముఖిలో ప్రతిభను చాటి ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌ గాని.. ఐఆర్‌ఎస్‌లో ఉద్యోగం వస్తుందని భావిస్తున్నానన్నారు. సివిల్స్‌ ప్రిపేర్‌ అయ్యేవారు కోచింగ్‌నే నమ్ముకోకుండా శిక్షణ పొందిన అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమమన్నారు. ఈ విజయానికి తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదని 2020 సివిల్స్‌లోనూ ప్రయత్నించి మంచి ర్యాంకు సాధిస్తానని చెప్పారు.

పాలకుర్తి మండలం వల్మిడికి చెందిన కేసారపు ప్రేమ్‌సాగర్‌ దేశవ్యాప్తంగా 170వ ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలోనే మెయిన్స్‌ వరకు వెళ్లిన ఆయన కృషి, పట్టుదలతో రెండోసారి ఈ ఘనత సాధించారు. బీటెక్‌ పూర్తి చేసిన ప్రేమ్‌సాగర్‌ 2018 నుంచే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న ఆయన ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు పరీక్షలకు పక్కాగా సిద్ధమయ్యారు. ప్రిలిమ్స్‌కు సుమారు 60 టెస్టులు రాయగా, మెయిన్స్‌కు 50 వరకు రాశారన్నారు. ఆయనకు మంత్రి దయాకర్‌రావు ప్రేమ్‌సాగర్‌కు ఫోన్​లో అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి:గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ABOUT THE AUTHOR

...view details