MLA Muthireddy Yadagiri Reddy Latest Comments : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి.. ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మద్య మరోసారి వివాదం తలెత్తింది. ముత్తిరెడ్డిపై ఆమె మరో కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. చేర్యాలలో తన పేరిట కొనుగోలు చేసిన స్థల వివాదంపై ఆయనతో.. భవానీ మాట్లాడారు. ఆ స్థలానికి సంబంధించి తనకు తెలియకుండానే సంతకం ఫోర్జరీ చేశారని.. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పింది. రిజిస్ట్రేషన్ సమయంలో తాను సంతకం కూడా చేయలేదని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దృష్టికి తీసుకువచ్చింది.
రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారు : దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందిస్తూ కంటతడి పెట్టుకున్నారు. తన కుమార్తె తుల్జా భవానీని రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే తన మనోస్థైర్యం దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంటి సమస్యను రాజకీయం చేయటం సరికాదని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హితవు పలికారు.
Muthireddy on Daughter Complaint : ఈ క్రమంలోనే తన సొంత ఆస్తి.. కూతురుకి ఇస్తే మోసం ఎలా అవుతుందని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయం ప్రజలకు,ముఖ్యమంత్రి కేసీఆర్కు అంతా తెలుసని అన్నారు. ప్రజాక్షేత్రంలో తప్పు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ గెలుస్తానని స్పష్టం చేశారు. తాను ఉన్నని రోజులు ప్రజాసేవలో ఉంటాననిముత్తిరెడ్డి యాదగిరిరెడ్డివెల్లడించారు.
"నా కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారు.ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదు.మా కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారు. నా మనోస్థైర్యం దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. నా ఇంటి సమస్యను రాజకీయం చేయటం సరికాదు. నా కుమార్తెకు నా సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుంది. ఈ విషయం ప్రజలకు,ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసు. ప్రజాక్షేత్రంలో తప్పు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ గెలుస్తా. తాను ఉన్నని రోజులు ప్రజాసేవలో ఉంటాను."- ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే
అసలేం జరిగిదంటే : ఇటీవలే కుమార్తె భవానీ తన సంతకాన్ని.. తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫోర్జరీ చేశారని ఉప్పల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని తెలిపారు. ఇదే విషయంపై ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. చేర్యాలలో 1200 గజాల భూమి తన బిడ్డ పేరు పైనే ఉందని.. ఎటువంటి ఫోర్జరీ జరగలేదని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి :MLA Muthireddy on Retired MPDO Murder : విశ్రాంత ఎంపీడీవో హత్య..! ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రియాక్షన్ ఇదే