జనగామ జిల్లా తెరాస కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. తరిగొప్పుల, నర్మెట్ట మండలాల లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. పది రోజుల కిందటే చెక్కులు వచ్చినప్పటికి కేటీఆర్ జన్మదినం నాడే చెక్కులు తీసుకుంటామని లబ్దిదారులు కోరడం వల్ల ఇవాళ పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.
'కేటీఆర్ పుట్టినరోజు నాడే చెక్కులు తీసుకుంటామన్నారు' - కేటీఆర్ పుట్టిన రోజు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
'కేటీఆర్ పుట్టినరోజు నాడే చెక్కులు తీసుకుంటామన్నారు'