రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ బాల్దె విజయ సిద్ధిలింగం తెలిపారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌తోపాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో సర్కారు చేస్తున్న కృషిని ఆమె వివరించారు.
'రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుతాం'
జనగామ వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ బాల్దె విజయ సిద్ధిలింగం అన్నారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తొలి పాలక వర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
'రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుతాం'
కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలను జనగామకు తెప్పించిన ఘనత ముత్తిరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.
ఇదీ చూడండి :వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం సమీక్ష