జనగామ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు రానున్న నెల రోజుల్లో పూర్తి చేసుకుని దసరా వరకు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ కె.నిఖిల తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల, చిల్పూర్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, తదితర మండలాల్లో ఆమె పర్యటించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనంలో జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలలో ప్రజలు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలో 62 రైతు వేదికల నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం కొన్ని పూర్తి దశకు వస్తున్నాయన్నారు. దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో పూర్తయి ఈనెల 15న ప్రారంభోత్సవానికి సిద్ధమైందని తెలిపారు. ప్రతి ఒక్కరు గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలను కాపాడాలని.. భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. ఈనెల 15 నుంచి గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
దసరా వరకు రైతు వేదికలు పూర్తి: జిల్లా కలెక్టర్
జనగామ జిల్లాలో దసరా వరకు రైతు వేదికలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ కె.నిఖిల తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు.
దసరా వరకు రైతు వేదికలు పూర్తి: జిల్లా కలెక్టర్
ఇవీ చూడండి: హోం ఐసోలేషన్‌కు కాలనీవాసుల అభ్యంతరం