జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జనగామ మండలం పసరమడ్ల గ్రామ శివారు మాత శిశు ఆస్పత్రికి నాగిరెడ్డిపల్లికి చెందిన నిండు గర్భిణీ మహ్మద్ బీబీ వైద్యం కోసం వెళ్లింది. నాలుగో కాన్పు, రక్తం తక్కువగా ఉందని వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల హన్మకొండకు వెళ్లమని వైద్యులు సూచించారు.
గర్భిణీ పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం.. గేటు వద్దే ప్రసవం - Janagama District Latest News.
జనగామ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. నిండు గర్భిణీ ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే రక్తం సరిగా లేదని పొమ్మన్నారు. ఆ క్రమంలో నొప్పులతో బయటకు వచ్చిన గర్భిణీ గేటు దగ్గరే ప్రసవించింది. కుటంబసభ్యుల ఆందోళనతో వైద్యులు స్పందించారు.
![గర్భిణీ పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం.. గేటు వద్దే ప్రసవం jangama Government Hospital staff negligence pregnant women delivered near hospital gate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8088805-706-8088805-1595163100999.jpg)
గర్భిణీ పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం.. గేటు వద్దే ప్రసవం
ఈ క్రమంలో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన మహిళ గేటు వద్ద ప్రసవించింది. బంధువులు ఆందోళన చేయడం వల్ల సిబ్బంది ఆమెను ఆస్పత్రిలోకి తీసుకుని వెళ్లి చికిత్స అందించారు. రక్తం అందుబాటులో లేకపోవడంతోనే హన్మకొండ మిషన్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని సూచించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. అంబులెన్స్ వచ్చే లోపే మహిళ ప్రసవించిందని.. తల్లీ కొడుకు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే? బాధ్యులెవరు?
ఇదీ చూడండి :'మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపేస్తారా'
Last Updated : Jul 19, 2020, 7:02 PM IST