కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఎల్ఆర్ఎస్ ఫీజులతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
ఎల్ఆర్ఎస్ ఫీజులు తగ్గించాలని ధర్నా
పెంచిన ఎల్ఆర్ఎస్ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణ వాసులు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ఎల్ఆర్ఎస్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణవాసుల ధర్నా
ప్రధాన చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, రిజిస్ట్రేషన్లు చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:షాద్‌నగర్-గొల్లపల్లి మధ్య రెండో లైన్ వేగం గంటకు 130 కి.మీ!