జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కేంద్రంలో స్వామి వివేకానందుని 158వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్టేషన్ రోడ్డులోని వివేకానందుని విగ్రహానికి సీఐ శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా సమాజ హితానికి తోడ్పడే పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
'యువత ఆయన బాటలో నడవాలి' - birth anniversary of Swami Vivekananda
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్టేషన్ రోడ్డులోని వివేకానందుని విగ్రహానికి సీఐ శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.
'యువత ఆయన బాటలో నడవాలి'
వివేకానందుని గొప్పతనాన్ని చెబుతూ ఆయన బాటలో నడవాలని... మంచి ప్రవర్తనను అలవాటు చేసుకోవాలని స్థానిక యువతకు శ్రీనివాస్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని... తద్వారా సమ సమాజ నిర్మాణం జరుగుతుందని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి:ఘనంగా వివేకానందుడి 158వ జయంతి వేడుకలు