పంటల సాగు విత్తన దశ నుంచి మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించేంతవరకు రైతులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని జనగామ కలెక్టర్ నిఖిల అన్నారు. జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో పంటల నమోదు, రైతు వేదిక, పల్లె పార్కు పనులను ఆమె మంగళవారం పరిశీలించారు.
పంటల నమోదు ప్రక్రియతో మేలు: కలెక్టర్ - janagama collector nikhila latest news
పంటల నమోదు ప్రక్రియతో మేలు జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. జనగామ మండలం గానుగుపహాడ్‌లో పంటల నమోదు, రైతు వేదిక, పల్లె పార్కును పరిశీలించారు.
పంటల నమోదు ప్రక్రియతో మేలు: కలెక్టర్
గ్రామ రైతు కన్నబోయిన రమేశ్, పోతుగంటి భాస్కర్‌ను వరి పంట పూర్తిగా ఎందుకు వేయాల్సి వచ్చిందని.. కొంతమేర పత్తి సాగు చేసుకోవచ్చు కాదా అని అడిగారు. వారు స్పందిస్తూ తమ భూమి వరి పంటకే అనుకూలమని తెలిపారు.