తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా టీకా కొనుగోలుకు అవకాశం ఇవ్వాలి: ఈటల - జనగామ జిల్లా తాజా వార్తలు

కరోనా టీకాల కొనుగోలుకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 4వ రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్​ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుతో కలిసి పాల్గొన్నారు.

ima state conference in janagama district
కరోనా టీకా కొనుగోలుకు అవకాశం ఇవ్వాలి: ఈటల

By

Published : Feb 1, 2021, 12:52 AM IST

ప్రపంచాన్నే గడగడలాడించిన కొవిడ్-19 వైరస్​కు టీకా తెలంగాణలో ఉత్పత్తి కావడం రాష్ట్రానికే గర్వకారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 4వ రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్​ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుతో కలిసి పాల్గొన్నారు. కరోనా టీకాల కొనుగోలుకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్రానికి అదనపు టీకాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.

ఒకే రోజు 10 లక్షల మందికి టీకా ఇచ్చే సామర్థ్యం తెలంగాణకు ఉందన్నారు. ఆయుస్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైందని.. వైద్య సేవలు అందించడంలో పేదలను ఇబ్బందులు పెట్టొద్దని ఐఎంఏను కోరారు. కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవలు మరవలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వ్యక్తిగతంగా కాకుండా వైద్యులు సమైక్యతతో సేవలు అందించాలని ఐఎంఏ జాతీయాధ్యక్షుడు జయలాల్ అన్నారు.

ఇదీ చదవండి: 'తెరాస' ఓపిక నశిస్తే.. 'భాజపా' బయట తిరగలేదు: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details