తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామ జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే - జనగామలో రక్త నమూనాలు సేకరిస్తున్న ఐసీఎంఆర్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బృందం జనగామ జిల్లాలో పర్యటిస్తోంది. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు రక్త నమూనాలను సేకరిస్తున్నారు. తొలి విడతగా జిల్లాకు వచ్చిన 5 బృందాలలో.. ఒక్కో బృందం 40 మంది నుంచి నమూనాలను సేకరించారు.

ICMR team tour in Janagama district
జనగామ జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే

By

Published : May 16, 2020, 7:33 PM IST

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బృందం జనగామ జిల్లాలో పర్యటిస్తోంది. జిల్లాలో ఎంపిక చేసిన 9 గ్రామలతో పాటు.. పట్టణంలోని ఒక వార్డులో బృందం నమూనాలను సేకరించాలి. జిల్లాకు వచ్చిన 5 బృందాల్లో .. ఒక్కో బృందం 40 మంది నుంచి నమూనాలు సేకరించింది.

ఇవాళ స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవపూర్, రఘునాథపల్లి మండలం కాంచనపల్లి, కొడకండ్ల మండలం లక్ష్మక్క పల్లితో పాటు పాలకుర్తి మండలం మంచుప్పల్ లో నమూనాలను సేకరించనున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 60 జిల్లాలను ఎంపిక చేసిందని, రాష్ట్రం నుంచి ఎంపికైన మూడు జిల్లాల్లో 15 బృందాలు నమూనాలను సేకరిస్తాయని నోడల్ అధికారి లక్ష్మయ్య వెల్లడించారు.

ఇదీ చూడండి:హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ

ABOUT THE AUTHOR

...view details