జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో మైనర్ బాలిక వివాహాన్ని ఐసీడీఎస్, బాలల పరిరక్షణ అధికారులు అడ్డుకున్నారు. వెల్దండ గ్రామానికి చెందిన కుంచం యాదగిరి తన 16 ఏళ్ల కూతురికి వివాహం చేస్తుండగా అక్కడికి చేరుకున్న అధికారులు పెళ్లిని అడ్డుకున్నారు. మైనర్‌కు వివాహం చేయడం నేరమని చెప్పగా పెళ్లిని నిలిపివేశారు. గ్రామ సర్పంచ్ సమక్షంలో తన కుమార్తెకు యుక్త వయస్సు వచ్చే వరకు వివాహం చేయబోమని యాదగిరి అంగీకార పత్రం రాసిచ్చారు.
మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో మైనర్ బాలికకు వివాహం జరుగుతుండగా ఐసీడీఎస్, బాలల పరిరక్షణ అధికారులు అడ్డుకున్నారు. బాలికకు యుక్త వయసు వచ్చేవరకు పెళ్లి చేయబోమని తండ్రి చేత అంగీకార పత్రంపై సంతకం చేయించారు.
మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు