Husband Kills Wife With Electric Shock in Jangaon :ఇటీవల కాలంలో వయసుతో తేడా లేకుండా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఈ మహమ్మరికి బానిస కావలం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎంతోమంది దంపతులు, అన్నదమ్ముల మధ్య కలహాలు, స్నేహితుల మధ్య గొడవలు చోటు చేసుకుని.. విడిపోయిన పరిస్థితులు కూడా చాలానే చూశాం. మద్యం మత్తులో జరిగే యాక్సిడెంట్స్కు అయితే లెక్కే లేదు. చాలామంది మద్యం మత్తులో హత్యలకు, అత్యాచారాలకు, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మద్యం మత్తులో పడిన వ్యక్తులు సృష్టించిన అరాచకాలెన్నో ఉన్నాయి. ఇలా మద్యం మత్తులో తన ఇంటిదీపాన్నే ఆర్పేసుకున్నాడు ఓ వ్యక్తి.
Husband Kills Wife Under Influence Of Alcohol :నిత్యం తాగుడుకు బానిసై ఓ వ్యక్తి భార్యను కర్రతో కొట్టి.. విద్యుత్ షాక్(Electric Shock) పెట్టి.. ఉరివేసి చంపాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగరాయిగూడెం శివారు కాశీంనగర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని పామునూరు శివారు కాశీగూడెంకు చెందిన కాశీం, మదారిబీ దంపతుల పెద్ద కుమార్తె హజరత. కుమార్తెను దంపతులు తొర్రూర్ మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన గాంధారి, ఫాతిమాబీ కుమారుడు అమీర్‌కు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం చేశారు.
Husband Kills Wife : ఈ క్రమంలో దంపతులు బతుకుదెరువు కోసం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగరాయిగూడెం గ్రామ శివారులోని కాశీంనగర్‌కు వచ్చి బండకొట్టే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అమీర్ తాగుడుకు బానిసగా మారి రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. అంతటితో ఆగకుండా.. తాగి వచ్చి హజరతను చితక బాదేవాడు. పలుమార్లు బంధువులు, కుటుంబ సభ్యులు అమీర్‌ను మందలించిన ఫలితం లేకుండా పోయింది. అతను ఏమాత్రం బుద్ధిమార్చుకోలేదు.