తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామలో జోరువాన... నీటమునిగిన పంటలు - heavy rain in janagama

జనగామ జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటచేలు నీట మునిగాయి.

జనగామ జిల్లావ్యాప్తంగా జోరు వాన

By

Published : Oct 10, 2019, 11:51 PM IST

జనగామ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురిసింది. నర్మెట్ట, తరిగొప్పుల, జనగామ, లింగాలఘన్​పూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పత్తి పంటలు నీటిలో మునిగిపోయాయి. నర్మెట్ట మండలం మచ్చుపహడ్​లో కొబ్బరిచెట్టుపై పడి ఇంట్లో విద్యుత్ వైర్లు కాలిపోగా, స్వల్పంగా ఇంటిపై పెచ్చులు ఊడి కిందపడ్డాయి, జనగామ మండలం సుందరయ్య నగర్​లో తాటిచెట్టుపై పిడుగు పడింది.

జనగామ జిల్లావ్యాప్తంగా జోరు వాన

ABOUT THE AUTHOR

...view details