జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులు లేక ఆలయాలు బోసిపోయాయి. తెల్లవారుజాము నుంచే అన్ని సాయిబాబా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
నిరాడంబరంగా గురుపౌర్ణమి వేడుకలు - జనగామ జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు
సాయిబాబా ఆలయాల్లో వైభవంగా జరగాల్సిన గురుపౌర్ణమి వేడుకలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిరాడంబరంగా సాగాయి. ఆలయాల్లో కిక్కిరిసిపోవాల్సిన భక్తులు, ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
![నిరాడంబరంగా గురుపౌర్ణమి వేడుకలు Guru Pournami Festival celebrations in Janagama district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7899268-368-7899268-1593927258171.jpg)
నిరాడంబరంగా గురుపౌర్ణమి వేడుకలు
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని లలితాంబికా దేవాలయంలో భక్తులు హోమాలు నిర్వహించారు. మీదికొండ గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గురుపూజ విశిష్టతను భక్తులకు వివరించారు.