జనగామ జిల్లా కేంద్రంలో సెంట్రల్ టాక్స్ డివిజన్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ శేషగిరి రావు, ఆడిట్ కమిషనర్ డీవీరెడ్డి పాల్గొని వ్యాపారవేత్తలకు జీఎస్టీపై అవగాహన కల్పించారు.
జనగామలో జీఎస్టీ అవగాహన సదస్సు - janagama dist latest news
ఏప్రిల్ 1నుంచి జీఎస్టీ కొత్త రిటర్న్ స్కీమ్ రాబోతున్న నేపథ్యంలో.. అధికారులు దీనిపై అవగాన కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ తెలిపారు
జనగామలో జీఎస్టీ అవగాహన సదస్సు
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమీషనర్ తెలిపారు, ఏప్రిల్ 1 నుండి కొత్త రిటర్న్ స్కీమ్ అమలుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జోనల్ లెవల్లో పరిష్కారమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి.. జఠిలమైన సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ తెలిపారు.