కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జనగామ పట్టణంలో 3వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ సుధా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొని పేద కుటుంబాలకు సరుకులను అందజేశారు. ప్రజలందరూ ఏకమై కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి... పేద కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ - కరోనా కట్టడి చర్యలు
లాక్డౌన్ సమయంలో పేద కుటుంబాలకు సాయం చేసేందుకు చాలా మంది దాతలు ముందుకొస్తున్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.
పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ