జనగామ జిల్లా నర్మెట్ట మండలకేంద్రంలో పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామంలోని దాదాపు 300 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ - groceries to needy in narmetta
కరోనాతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలకేంద్రంలో పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు సహకారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్వర్, సర్పంచ్ కమలాకర్ రెడ్డి, ఎంపీటీసీ మురళి పాల్గొన్నారు.