జనగామ జిల్లాలో ఘనంగా రాజీవ్ 75వ జయంతి వేడుకలు - జనగామ జిల్లా
జనగామ జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన జనగామ కాంగ్రెస్ నేతలు
జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జీ ధర్మ సంతోష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఆవరణలో పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.