జనగామలోని షెడ్యూలు కులాల జిల్లా అభివృద్ధి శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. కార్యాలయంలో పనిచేసిన అటెండర్ రెనుకుంట్ల ఐలయ్య 2 నెలల క్రింద పదవీ విరమణ పొందాడు. ఐలయ్యకు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు చేసేందుకు అధికారి గట్టుమల్లు, సూపరింటిండెంట్ ఖదీర్... రూ. 10వేలు డిమాండ్ చేశారు.
అటెండర్ దగ్గర లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జలగలు - ACB CAUGHT BRIBERS IN JANAGON
తమ దగ్గర అంటెండర్ విధులు నిర్వర్తించిన వ్యక్తి వద్దనే లంచం డిమాండ్ చేశారు ఆ అవినీతి అధికారులు. రిటైర్మెంట్ అయ్యాక పింఛన్ డబ్బుల కోసం సంతకాలు పెట్టమంటే... కసురుకున్నారు. లంచం ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా కనికరం చూపలేదు. చివరికి అనిశాకు అడ్డంగా దొరికిపోయారు.
![అటెండర్ దగ్గర లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జలగలు GOVERNMENT OFFICERS CAUGHT TO ACB IN JANAGON](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6167378-thumbnail-3x2-pppp.jpg)
GOVERNMENT OFFICERS CAUGHT TO ACB IN JANAGON
లంచం ఇచ్చుకొనని బాధిత వ్యక్తి ప్రాధేయపడగా... రూ. 5 వేలకు బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇచ్చేందుకు మనసొప్పని ఐలయ్య... అనిశాను ఆశ్రయించాడు. మొత్తం విషయాన్ని వివరించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకుని.... కేసు నమోదు చేశారు.
అటెండర్ దగ్గర లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జలగలు