తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. జనగామ డిపో నుంచి ప్రధాన చౌరస్తాలోని అంబేడ్కర్ కూడలి వరకు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికులు నిరసన తెలిపారు. తమను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై మంత్రులకు, ఎమ్మెల్యేలకు రేపు వినతిపత్రాలు అందిస్తామని అన్నారు. పెద్దఎత్తున సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన - undefined
ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. జనగామలో అర్థనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు.
ఇకనైానా మమల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : ఆర్టీసీ కార్మికులు