జనగామ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వాసవి కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు బాలరాజు ఇంట్లో చొరబడి సుమారు 12 తులాల బంగారం, 45 తులాల వెండి, లక్షా 30 వేల నగదు దోచుకెళ్లారు.
హర్షనగర్లోని కృష్ణరెడ్డి ఇంట్లో అర తులం బంగారం, 8 తులాల వెండి, 6 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.
'జనగామ జిల్లాలో దొంగల బీభత్సం' - theives hulchal
ఓ ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడిన దొంగలు పెద్ద మెుత్తంలో సొమ్ము తస్కరించిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇంట్లోకి చొరబడిన దొంగలు పెద్ద మెుత్తంలో సొమ్ము తస్కరించారు
ఇవీ చూడండి : భగ్గుమంటున్న భానుడు.. భరించలేకపోతున్న జనం
Last Updated : May 26, 2019, 10:02 PM IST